ntr fans fire on meera chopra!
సామాజిక మాధ్యమాల్లో అభిమానుల వీరంగం గురించి తెలిసిందే. ఒక్కోసారి సెలబ్రిటీ ఏమాత్రం నోరు జారినా దాని ఫలితం అంతే తీవ్రంగా ఉంటుంది. ``చంపేస్తాం.. నరికేస్తాం!`` అనేంతవరకూ వెళుతుంది. నోటికి వచ్చిన పదజాలం ఉపయోగించి బూతులు తిట్టేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ మీరా చోప్రాకి ఎన్టీఆర్ అభిమానుల నుంచి అలాంటి సెగ తగిలింది. మీరాకి తీవ్రమైన వార్నింగులు వెళ్లాయి.ఈ విషయాన్ని తనే స్వయంగా సామాజిక మాధ్యమాల్లో స్క్రీన్ షాట్లను షేర్ చేసింది. తనను ఎన్టీఆర్ అభిమానులు చంపేస్తామని వార్నింగ్ [...]