in

Rashmika reveals she didn’t want to be an actress!

న తాజా చిత్రం ‘సికందర్‌’ ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన నేపథ్యంలో, ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అంతకుముందు ఆమె నటించిన ‘ఛావా’ చిత్రం మంచి విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ, “జీవితంలో ఏదీ శాశ్వతం కాదనే విషయం నాకు బాగా తెలుసు. గతంలో కూడా చాలాసార్లు ఈ అంశం గురించి మాట్లాడాను. ఒకరోజు మనకు అనుకూలంగా ఉంటే, మరుసటి రోజే పరిస్థితి మారిపోవచ్చు..

ఇలాంటి సమయాల్లో నా కుటుంబం, స్నేహితుల నుంచి లభించే మద్దతు నా అదృష్టం. ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కోవడంలో వారు నాకు అండగా నిలుస్తారు” అని తెలిపారు. తాను అనుకోకుండానే నటనారంగంలోకి వచ్చానని రష్మిక గుర్తుచేసుకున్నారు. “నిజం చెప్పాలంటే, నటిని అవుతానని నేనెప్పుడూ ఊహించలేదు. ఈ రంగంలోకి రావడానికి ప్రత్యేకంగా ప్రణాళికలేమీ వేసుకోలేదు. ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే, నేనెంత అదృష్టవంతురాలినో అర్థమవుతోంది” అని ఆమె వివరించారు..!!

happy birthday Ilaiyaraaja!

Sreeleela’s fans wondered if she was getting married!