in

Rashmika Mandanna’s women-centric attempt with rahul ravindran!

ప్రస్తుతం అగ్ర కథానాయికలు భారీ కమర్షియల్‌ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు మహిళా ప్రధాన ఇతివృత్తాలపై దృష్టిపెడుతున్నారు. వినూత్న కథాంశాల ద్వారా తమ ప్రతిభాసామర్థ్యాల్ని చాటుకోవాలంటే లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలే ఉత్తమమనే భావనతో ఉన్నారు. ఇప్పటికే పలువురు అగ్ర నాయికలు మహిళా ప్రధాన చిత్రాలతో సత్తా చాటారు. ఇప్పుడు వారి వరుసలో కన్నడ సోయగం రష్మిక మందన్న చేరబోతున్నది. అనతికాలంలోనే దక్షిణాదిన టాప్‌ హీరోయిన్‌గా ఎదిగిన ఈ అమ్మడు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది.

ఇటీవల విడుదలైన ‘పుష్ప’చిత్రంలో ఆమె పోషించిన శ్రీవల్లి పాత్రకు మంచి ప్రశంసలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ భామ ఓ లేడీ ఓరియెంటెడ్‌ సినిమాకు ఓకే చెప్పిందని అంటున్నారు. ఈ చిత్రానికి రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించనున్నారు. సరికొత్త కాన్సెప్ట్‌తో ఆయన చెప్పిన కథ రష్మిక మందన్నకు బాగా నచ్చిందని..దాంతో ఆమె వెంటనే సినిమాకు అంగీకరించిందని చెబుతున్నారు. ఫిబ్రవరిలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్లనుందని తెలిసింది. రష్మిక మందన్న తెలుగులో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో కథానాయికగా నటిస్తున్నది.

‘Godse Teaser’, Satya dev, Aishwarya Lekshmi!

Payal Rajput’s item song for Ravi Teja’s ‘dhamaka’!