నేషనల్ క్రష్ రష్మిక మందన్న టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా వెలిగిపోతోంది. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే ఈ ఘనత సాధించిన రష్మిక.. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ అడుగుపెట్టింది. ఇటీవల సంచలన విజయం సాధించిన ‘ఛావా’ సినిమాలో హీరోయిన్ గా నటించింది. రష్మిక ఒక్కో సినిమాకు పారితోషికంగా రూ.10 కోట్లు తీసుకుంటుందని ప్రచారం జరుగుతోంది. తాజాగా రష్మిక ఆస్తులకు సంబంధించి సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోంది..
ఫోర్బ్స్ సంస్థ అంచనాల ప్రకారం..రష్మిక ఆస్తుల విలువ ప్రస్తుతం రూ.70 కోట్లు అని, అతి త్వరలోనే రూ.100 కోట్లకు చేరుతుందని తెలిపింది. ఈ బ్యూటీకి బెంగళూరు, కూర్గ్, హైదరాబాద్, గోవా, ముంబైలలో సొంత ఇళ్లు ఉన్నాయని పేర్కొంది..పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన రష్మిక మందన్న తన ప్రతిభతో కోట్లకు కోట్లు సంపాదించడమే కాకుండా, ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. సినిమాలు, బ్రాండ్ ఎండోర్స్‌మెంట్స్, ఆస్తులు, కార్ల కలెక్షన్ ఇలా ఆమె లైఫ్ స్టైల్ కి సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది..!!