in

Rashmika Mandanna Special Song in Ram Charan’s Movie?

రామ్ చరణ్‌తో స్పెషల్ సాంగ్ అంటే, ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చరణ్ డ్యాన్స్‌కు థియేటర్లు షేక్ అయిపోతాయి. అలాంటి చరణ్‌కు సూపర్ క్రేజ్ ఉన్న రష్మిక తోడేతై మామూలుగా ఉండదు. ఇప్పుడు దర్శకుడు బుచ్చిబాబు అలాంటి ప్లానే చేస్తున్నాడట. బుచ్చిబాబుతో రామ్ చరణ్ ఆర్సీ 16 ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ సరసన హీరోయిన్‌గా జాన్వీకపూర్‌ నటిస్తోంది. అయితే, ఈ సినిమాలో ఓ అదిరిపోయే స్పెషల్ సాంగ్ పెట్టే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.

ఇప్పటికే ఏఆర్ రెహమాన్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చినట్టుగా బుచ్చిబాబు చెప్పుకొచ్చాడు. రెహమాన్ మ్యూజిక్ గురించి అందరికీ తెలిసిందే. అందుకే.. ఆర్సీ 16 ఆల్బమ్ పై భారీ అంచనాలున్నాయి. అందులో ఓ స్పెషల్ సాంగ్‌ను రష్మిక మందన్నా చేత చేయిస్తే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. ఈ విషయంలో ఇంకా క్లారిటీ లేదు గానీ, ఒకవేళ రష్మిక స్పెషల్ సాంగ్‌కు సై అంటే మాత్రం, మామూలుగా ఉండదనే చెప్పాలి..!!

megastar to repeat god father combination?

After Mahanati, Keerthy to Play MS Subbulakshmi?