బయోపిక్స్ లో ఎం.ఎస్ సుబ్బలక్ష్మి ఫిలిం ఒకటి. గొప్ప వ్యక్తుల జీవితాలను నేటి తరానికి అందించి, వారిని చిరస్థాయిగా ప్రజల్లో నిలిపేందుకు సినిమా ఒక అద్భుత మాధ్యమం. ఇదే మనం వారికి ఇస్తున్న ఘన నివాళి. సంగీతానికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన ఎం.ఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథ సినిమాగా తెరకెక్కించనున్నారని సమాచారం. అయితే ఎవరు ఈ సినిమా బాధ్యతలు తీసుకున్నారు ఏంటి అనేది ఇంకా తెలియలేదు కానీ, గ్రేట్ లెజండరీ ఎం.ఎస్ సుబ్బలక్ష్మి పాత్రలో ఎవరు నటిస్తే బాగుంటుందో అనే చర్చలు సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి.
After Mahanati, Keerthy to Play MS Subbulakshmi?
ఎం.ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ లో మొదటగా వినిపించిన పేరు కీర్తి సురేష్. మహానటి సినిమాలో సావిత్రి పాత్రలో ఒదిగిపోయిన కీర్తి అయితే బాగుంటుందని పలువురు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మహానటిలో మొదట కీర్తి నటిస్తుంది అనగానే అందరిలో సందేహాలు మొదలయ్యాయి. నాగ అశ్విన్ సెలక్షన్ పట్ల అంతా పెదవి విరిచారు. కానీ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగానే కీర్తి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యిందని ఒప్పుకున్నారు. మహానటి సినిమాలో ఎక్కడా కీర్తి కనిపించలేదు, సావిత్రినే చూసారు ప్రేక్షకులు..!!