తాజాగా మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నారు. ఇక ఇలాంటి రికార్డు సృష్టించిన మొట్టమొదటి హీరోయిన్గా రష్మిక నిలవటం విశేషం. ఇటీవల రష్మిక నటించిన యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాలను సొంతం చేసుకున్నాయి. అయితే ఈ మూడు సినిమాలు వరుసగా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద 500 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది..
ఇప్పటివరకు ఏ హీరోయిన్ విషయంలో కూడా ఇలా జరగలేదని ఇలాంటి ఘనత సాధించిన మొట్టమొదటి హీరోయిన్గా రష్మిక గుర్తింపు పొందారు. యానిమల్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.556.36 కోట్లు వసూలు చేసింది. ‘పుష్ప 2’ హిందీ వెర్షన్ 830 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇప్పుడు ఛావా రూ.516 కోట్లు కలెక్ట్ చేసింది. ప్రస్తుతం ఈమెయిల్ బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తో కలిసి సికిందర్ అనే సినిమాలో నటిస్తున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో తెలియాల్సి ఉంది. .