ఇటీవల జరిగిన ఫిల్మ్ ఫెస్టివల్‌లో నిర్మాత ఎస్.థాను..రంభ రీ ఎంట్రీ గురించి మాట్లాడారు. రంభ ఆర్థికంగా సెటిల్ అయ్యారు. ఆమె భర్త కూడా ఒక ప్రముఖ వ్యాపారి. అతను ఇటీవల తనను కలిసినప్పుడు రంభకు ఒక మంచి సినిమాలో అవకాశం కల్పించమని కోరారని అన్నారు. అటువంటి అవకాశం దొరికితే ఆమెను తప్పక సంప్రదిస్తానని రంభ భర్తకు హామీ ఇచ్చానని చెప్పారు.
దీంతో రంభ మళ్లీ సినీ రంగంలోకి అడుగుపెడుతుందని ఆమె అభిమానులు భావిస్తున్నారు..మరోవైపు రీ ఎంట్రీపై రంభ మాట్లాడుతూ సినీ రంగంలోకి పునరాగమనానికి ఇదే సరైన సమయం అనుకుంటున్నా..నా వయస్సుకు తగినట్టు ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నా..మంచి పాత్రల ద్వారా తిరిగి ప్రేక్షకుల అభిమానం సంపాదించుకోవాలనుకుంటున్నా అని చెప్పారు..!!