ప్రతి సినిమా ఒప్పుకోవడానికి ఓ పాయింట్ ఉంటుంది. అది కనెక్ట్ అయితే సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుంటారు. ఆడవాళ్లు మీకు జోహార్లు ప్రాజెక్టులో అలాంటివి 2 పాయింట్లు రష్మికకు కనెక్ట్ అయ్యాయంట. అందుకే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నానంటోంది ఈ కన్నడ కస్తూరి..“కిషోర్ గారు ఈ సినిమా స్క్రిప్ట్ నెరేట్ చేసినప్పుడు హిలేరియస్ గా నవ్వుకున్నాను. ముఖ్యంగా ఇంటర్వెల్ సీన్ బాగా నచ్చింది. అలాగే సెకండాఫ్ లో ఒక సీన్ ఉంటుంది అది కూడా నా ఫేవరేట్. ఆ పార్ట్స్ నాకు బాగా నచ్చాయి. ఆ రెండు సీన్స్ వల్లే ఈ సినిమా ఒప్పుకున్నాను.”
ఇక వ్యక్తిగత జీవితానికొస్తే, తను పెళ్లి చేసుకోబోతున్నానంటూ వచ్చిన పుకార్లను ఖండించింది రష్మిక. హీరో విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి. వాటిపై స్పందించిన రష్మిక.. అలాంటి రూమర్స్ చూసి నవ్వుకుంటానంటోంది..“ఈ మధ్య నా పెళ్లి గురించి కొన్ని న్యూస్ లు చూశాను. ఇప్పుడే అలాంటి ఆలోచన లేదు. ప్రస్తుతం యాక్ట్రెస్ గా మంచి రోల్స్ చేయాలి. ఇంకా ఎక్కువ సినిమాలు చేయాలని మాత్రమే ఆలోచిస్తున్నాను. కొందరు నా పెళ్లి గురించిఏవేవో రాస్తున్నారు. అవి చూస్తూ రాసుకోండి చిల్ అనుకుంటాను తప్ప ఎక్కువ పట్టించుకోను.”