సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పిన రష్మిక
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చేసిన పొరపాటును తెలుసుకుని తాజాగా సోషల్ మీడియా వేదికగా సారీ చెప్పారు. తాను థియేటర్‌లో చూసిన మొదటి సినిమా తమిళ హీరో విజయ్ నటించిన ‘గిల్లీ‘ అని తెలిపారు. అందుకే విజయ్ దళపతి అంటే తనకు అమితమైన ఇష్టమని ఆమె ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ సందర్భంలో ‘గిల్లీ‘ మూవీ తెలుగు ‘పోకిరి‘ సినిమాకు రీమేక్ అని రష్మిక పొరబడ్డారు..
విజయ్ దళపతి సినిమా రీమేక్ పేరు తప్పు చెప్పిన రష్మిక
కానీ, ఆ మూవీ ‘ఒక్కడు‘కి రీమేక్ కావడంతో సరదాగా ఆట పట్టిస్తూ ఆమె ఇంటర్వ్యూ వీడియోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. దీనిపై తాజాగా రష్మిక ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. అందులోనూ తెలుగులో ఫన్నీగా రాసి పోస్ట్ చేశారు. “అవును..ఇంటర్వ్యూ అయిపోయాక గుర్తొచ్చింది..సారీ. గిల్లీ సినిమా ఒక్కడు రీమేక్ అని. పోకిరి మూవీని అదే పేరుతో తమిళంలో రీమేక్ చేశారు. అప్పటికే సోషల్ మీడియాలో నాపై పోస్టులు వైరల్ అయ్యాయి. సారీ..సారీ..మై బ్యాడ్. కానీ, నాకు వాళ్లు నటించిన అన్ని సినిమాలు ఇష్టమే” అని ఆమె రాసుకొచ్చారు..!!