
సినిమాల్లోకి వచ్చిన కొత్తలో మామూలుగానే ఉన్న రాశి ఖన్నా , ఆ తరువాత కొంత బొద్దుగా తయారయింది. అయితే రాను రాను బాగా బొద్దుగా తయారవుతూ వచ్చిన రాశి, గత కొద్దిరోజుల నుండి మాత్రం మెల్లగా బరువు తగ్గడం మొదలెట్టి, ఇటీవల బాగా సన్నగా తయారయింది. అయితే ఈ విషయమై తన సన్నిహితులు కూడా చాలా మంది తనను అడిగేవారని, ఇదివరకు ఎంతో బొద్దుగా ఉన్న నువ్వు, ఇప్పుడు ఇంతలా ఎలా బరువు తగ్గిపోయావు అని ఆడిగారని ఆమె అన్నారు. అయితే దీనిపై ఇటీవల ఒక మీడియా ఛానల్ తో మాట్లాడిన రాశి, తాను బాగా బరువు తగ్గడం పై పూర్తిగా వివరణ ఇచ్చారు. వాస్తవానికి తను ఒకానొక సమయంలో ఒక వ్యక్తి ప్రేమలో పడ్డానని, ఆ తరువాత దానివలన జరిగిన కొన్ని పరిణామాలు తన మనసులో అలానే పాతుకుపోయాయని ఆమె అన్నారు. అది మాత్రమే కాక, ఆపై తనకు థైరాయిడ్ వ్యాధి అటాక్ ఆయిందని అన్నారు. అయితే ఆ తరువాత మెల్లగా ఆ డిప్రెషన్ నుండి బయటపడిన తానూ, ఒకానొక సమయంలో ఇటీవల మరొక వ్యక్తిని చూసి మనసు పారేసుకున్నానని, అప్పటి నుండి తన మనసులో ఏదో తెలియని ఆనందంతో పాటు తెలియని ఉత్సాహం కూడా తనకు లభించిందని, దాని వల్లనే తాను రాను రాను మెల్లగా బరువు తగ్గుతూ ఉన్నానని వెల్లడించారు. అయితే నువ్వు ఎవరితో ప్రేమలో ఉన్నావు అని తన సన్నిహితులు అడిగినప్పటికీ తాను మాత్రం ఆ విషయం బయటపెట్టలేదని, ఎందుకంటే ప్రేమ అనేది ఒక అద్భుతమైన భావన అని ఆమె అన్నారు. అయితే రాశి ఖన్నా ఎవరిని ప్రేమిస్తోంది, ఆమె క్రష్ ఎవరు అనే దానిపై ఇప్పటికే ఆమె ఫ్యాన్స్ పలు ఆలోచనలు మొదలెట్టేశారు….!!

