ఇటీవలే థాంక్యూ సినిమా కోసం విదేశాల కు వెళ్లి షూటింగ్ పూర్తి చేసుకుని ఇండియాకు తిరిగొచ్చింది రాశీఖన్నా. ఇక్కడకు రాగానే సేవా కార్యక్రమాలు ప్రారంభించింది. కోవిడ్ సంక్షోభ సమయంలో ముందుకొచ్చి సాయం చేసినపుడే సెలబ్రిటీ స్టేటస్ కు సరైన అర్థం ఉంటుందని చెప్పింది. ఎవరైనా అతడు కానీ, ఆమె కానీ సెలబ్రిటీ అని పిలవబడితే, అది తన చుట్టూ ఉన్న వారికి సాయం చేసినపుడే. కొందరు సెలబ్రిటీలు చేస్తున్న సేవలు ప్రశంసనీయం.
ఈ కష్ట సమయంలో అందరికీ చేరువ కావడానికి సోషల్ మీడియా చాలా బాగా ఉపయోగపడుతుంది. మంచి అభిమానులున్న సెలబ్రిటీలు చాలా మందికి రోల్ మోడల్స్ గా నిలుస్తున్నారని చెప్పింది. చాలా మంది సెలబ్రిటీలు ముందుకొచ్చి తమవంతు సాయం చేయాలని కోరింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్క వ్యక్తి ఏం చేయలేరు. అందరం కలిసి సాయం చేయాల్సిన సమయం. ఎన్జీవోస్ సాయంతో నా వంతుగా హెల్ప్ చేస్తున్నా. ఆకలిని తీర్చేందుకు ప్రయత్నిస్తున్నానని చెప్పు కొచ్చింది..