in

rashi khanna clarifies her rumors!

ముద్దుగుమ్మగా మారిన బొద్దుగుమ్మ కెరీర్‌ మొదట్లో గ్లామర్‌కు దూరంగా వుండేది. రాను రాను.. గ్లామర్‌ షోకు ఇంపార్టెన్స్‌ ఇస్తూ వస్తోంది. ఈమధ్యకాలంలో ఖాళీ దొరికే చాలు.. హాట్ హాట్‌ ఫొటోషూట్స్‌తో రెచ్చగొడుతోంది రాశి. రాశిఖన్నా విజయ్‌ దేవరకొండతో నటించిన ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చేదు అనుభవం మిగిల్చింది. ఇందులో పోషించిన యామిని రోల్‌ తనకు ఎంతో పేరు తెస్తుందని ఆశపడింది. టీజర్‌.. ట్రైలర్‌లో బోల్డ్‌గా కనిపించదన్న కామెంట్స్‌ వచ్చినా.. క్యారెక్టర్‌ డిమాండ్‌ చేసిందని.. ఎమోషన్‌ చూడాలి తప్ప.. బోల్డ్‌ నెస్‌ చూడకూడదని కవరింగ్‌ ఇచ్చింది రాశి.

తీరా సినిమా బాక్సాఫీస్‌ వద్ద ఫ్లాప్‌ అయ్యేసరికి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇక నుంచి హద్దులు దాటనని.. పేరెంట్స్‌ హర్ట్‌ అయ్యే రోల్స్‌ చేయనని..రాశి అన్నట్టు వెబ్‌సైట్లు రాయగా.. ట్విట్టర్‌ వేదికగా ఈ వార్తలను రాశి ఖండించింది. వరల్డ్ ఫేమస్‌ లవర్‌ విషయంలో తను అలా మాట్లాడలేదని రాశీ ఖన్నా స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో స్పందించారు. తను నటించిన ప్రతి సినిమాను స్వీకరిస్తానని, బాధపడుతూ ఏ సినిమాలోనూ నటించలేదని చెప్పింది. సినిమా హిట్టయినా.. ఫ్లాయినా.. ప్రతి సినిమా ఒక అందమైన ప్రయాణం. ప్రతి చిత్రం కొత్త విషయాల్ని నేర్పుతుందని పేర్కొంది రాశి.

interesting update on ‘radhe shyam’ climax!

no regular songs in pawan – krish movie!