in

rana daggubati to do ‘malik’ remake!

మధ్యే అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలై అద్భుతమైన స్పందన తెచ్చుకున్న మాలిక్ సినిమాను తెలుగులో రానా హీరోగా రీమేక్ చేయాలని చూస్తున్నారు. అక్కడ స్టార్ హీరోగా వెలిగిపోతున్న ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో నటించాడు. లాక్ డౌన్ పుణ్యమా అని వరసగా ఓటీటీ రిలీజ్ లతో ఫహాద్ తెలుగులోనూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో విలన్ గా నటిస్తున్నాడు.

ఈయన హీరోగా నటించిన మాలిక్ సినిమాను ఇప్పుడు తెలుగులో రీమేక్ చేయాలని చూస్తున్నారు.మత ఘర్షణలు, రాజకీయాల నేపథ్యంలో సాగే ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఫహద్ యాక్టింగ్‌ కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా తెలుగు రీమేక్ లో రానా నటిస్తే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారు మేకర్స్.

ఈ మేరకు తెలుగు రీమేక్ రైట్స్ తీసుకోడానికి సన్నాహాలు చేస్తున్నారు కూడా. నిజానికి ఈ స్టోరీ రానాకి చాలా సూట్ అవుతుంది. విలక్షణ పాత్రలతో మెప్పించే రానాకు ఇలాంటి రోల్ ఇస్తే చంపేస్తాడంతే అంటున్నారు అభిమానులు. దాంతో బయటి వాళ్ళు ఎందుకని సురేష్ ప్రొడక్షన్స్ రీమేక్ హక్కులు కొనడానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి మాలిక్ రీమేక్ రానా చేస్తే ఎలా ఉంటుందో చూడాలి.

ramya krishna replaced with shriya for ‘bangarraju’?

n.t.r. odilo kurchuni kaburlu cheppina jayanthi aa taruvatha ayana sarasane heroin ayaaru!