నాగార్జున – రమ్యకృష్ణలది ఎవర్ గ్రీన్ జోడీ. వీరిద్దరి కాంబినేషన్‌లో ఎన్నో సూపర్ హిట్లు వచ్చాయి. `సోగ్గాడే చిన్ని నాయిన`లోనూ వీరిద్దరూ జోడీ కట్టారు. అయితే ఈ సినిమాకి ప్రీక్వెల్ గా వస్తున్న `బంగార్రాజు`లో మాత్రం రమ్యకృష్ణ ని తీసేసినట్టు సమాచారం.. నాగ్ కెరీర్‌లోనే భారీ విజయం సాధించిన చిత్రం `సోగ్గాడే చిన్నా నాయిన`. దీనికి ప్రీక్వెల్ గా `బంగార్రాజు` తెరకెక్కించాలని నాగ్ ఎప్పటి నుంచో అనుకుంటున్నాడు. కథ కూడా సిద్ధమైంది. అయితే… కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వచ్చింది.
ఎట్టకేలకు ఇప్పుడు పట్టాలెక్కబోతోంది. ఆగస్టు 20 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇందులో నాగచైతన్య కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే. తనకు జోడీగా కృతి శెట్టి కనిపించబోతోంది. నాగ్ కి జోడీగా శ్రియ నటించబోతోందట. `బంగార్రాజు`లో నాగ్ సతీమణిగా కనిపించిన రమ్యకృష్ణ స్థానంలో శ్రియ వచ్చిందని సమాచారం. రమ్యకృష్ణ ఈమధ్య మరీ బొద్దుగా మారిపోయింది. దానికి తోడు.. సినిమాలంటే పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. అందుకే రమ్య స్థానంలో.. శ్రియని ఎంచుకోవాల్సివచ్చిందని టాక్.