పత్రిక అధిపతిగా, వ్యాపావేత్తగా రామోజీ రావు గారికి ఉన్న గుర్తింపు ఎటువంటిదో అందరికి తెలుసు. అయన సారధ్యం లో పని చేయాలనీ ప్రముఖ జర్నలిస్టులు, రచయితలు కోరుకుంటారు, అటువంటి రామోజీ రావు పంపిన బ్లాంక్ చెక్కును తిప్పి పంపిన ఆరుద్ర. రామోజీ రావు అంతటి వారు పంపిన బ్లాంక్ చెక్కును ఎందుకు తిరిగి పంపించారు, అయన ఇచ్చిన ఆఫర్ ఏమిటి, ఆ ఆఫర్ ను ఆరుద్ర ఎందుకు రిజెక్ట్ చేసారు. ఈనాడు దిన పత్రిక లో సాహిత్యానికి సముచిత స్థానం ఇవ్వటం లేదన్న సాహితీ ప్రియుల విమర్శలకు ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకున్న రామోజీ రావు, ఒక సాహితి పత్రిక తీసుకొని రావాలి అని నిర్ణయించుకొని ఆ పత్రికకు సారధ్యం వహించమని, ప్రముఖ రచయిత, సాహితి పరిశోధకుడు, విమర్శకుడు అయిన ఆరుద్ర గారి కి వర్తమానం పంపుతూ, దానికి బ్లాంక్ చెక్కును కూడా జోడించారు.
అయితే ఆ వర్తమానం చదివిన ఆరుద్ర గారు సున్నితంగా తిరస్కరిస్తూ, తిరిగి మరొక లేఖ రామోజీ రావు గారికి రాశారట. నేను కిడ్నీ సమస్యతో బాధ పడుతున్నప్పుడు, మాగుంట సుబ్బరామి రెడ్డి గారు నాకు ఆర్ధికంగా అండగా నిలిచారు, వారు ఒక వార పత్రికను పెట్టె ఆలోచనలో ఉన్నారని ఈ మధ్యే తెలిసింది. వారు చేసిన సాయానికి కృతజ్ఞతగా ఆ వార పత్రికకు పని చేస్తానని మాట ఇచ్చాను, రెండు పడవల ప్రయాణం సాధ్యం కాదు కాబట్టి, మీరు నా పట్ల గౌరవం తో ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేక పోతున్నందుకు క్షమించండి అంటూ రామోజీ రావు పంపిన చెక్కును తిరిగి పంపించటం జరిగింది.