ట్రైన్ చీకట్లో వేగంగా సాగి పోతుంది, కంపార్ట్మెంట్ లో అయిదుగురు వ్యక్తులు సీరియస్ గ పేక ఆడుతున్నారు, ఇంతలో టి.సి. ఎంటర్ అయ్యాడు” టికెట్ ప్లీజ్” అంటూ, పేకాటలో సీరియస్ గ ఇన్వొల్వె అయిన వారిలో నలుగురు మాత్రం టికెట్ చూపించారు విసుగ్గా, అయిదవ వ్యక్తి అసలు పట్టించోకోలేదు. టి.సి. కాస్త స్వరం పెంచి టికెట్ ప్లీజ్ అన్నాడు, అవతలి వైపు నుంచి రెస్పాన్స్ లేదు, టి.సి. కాస్త అసహనం గ టికెట్ ఉందా? లేదా? అని గద్దించాడు. సన్నగా రివట లాగా ఉన్న ఆ వ్యక్తి “ఒరే ఏందబ్బా అంత సీరియస్ అవుతావేంది” అంటూ టి.సి. చేతిలో పేక ముక్క పెట్టాడు, ఇదిగో సూస్కో టికెట్ అంటూ. దెబ్బకు వళ్ళు మండిన టి.సి. ఏవిటండి ఆటలు గ ఉందా? టికెట్ లేక పోతే నెక్స్ట్ స్టేషన్ లో పోలీసులు వస్తారు జాగర్త అంటూ వార్నింగ్ ఇచ్చాడు..
“ఒరే నీ బండ బడా, అది టికెట్ కాదా ఇట్టా ఇయ్యి” అని, ఆ పేక ముక్కను గాలిలో ఊపి టి.సి. చేతిలో పెట్టాడు. టి.సి. కి మతిపోయింది అది ఆ రోజు టికెట్, అప్పుడు గుర్తించాడు టి.సి. ఆ సన్నటి వ్యక్తి సినీ నటుడు రమణ రెడ్డి అని. సర్ మీరు ఇలా పేక ముక్కలను టిక్కెట్లు చేస్తే రైల్వేస్ దివాళా తీస్తుంది అంటూ దండం పెట్టేసాడు. మనందరికీ తెలిసింది రమణ రెడ్డి గారు హాస్య నటుడు అని మాత్రమే, తెలియంది ఏమిటంటే ఆయన మంచి మేజిషన్ కూడా. ఒకసినిమా కోసం మేజిక్ చేయటం నేర్చుకున్న రమణ రెడ్డి గారు సేవ కార్యక్రమాలు కోసం మేజిక్ ప్రదర్శనలు ఇచ్చే వారు. సినిమాలలో, బయట ఎపుడైనా సరదాగా ఇలా తన మేజిక్ లతో సహచరులను, ప్రేక్షకులను ఆట పట్టిస్తూ ఉండే వారు..