
టాలీవుడ్లో యంగ్ అండ్ స్టార్ హీరోల్లో ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కూడా ఒకరు. విభిన్నమైన కథలు, ప్రయోగాత్మక పాత్రలతో ప్రేక్షకులను అలరించే రామ్ ప్రస్తుతం రెండు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఒకవైపు కోలీవుడ్‌లో విలన్ పాత్రలో కనిపించేందుకు సిద్ధమవుతుండగా, మరోవైపు తెలుగులో తొలిసారి మెగాఫోన్ పట్టుకుని తన దర్శకత్వంలోనే హీరోగా ఓ క్రేజీ యాక్షన్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కోసం రామ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించబోతుండటంతో అభిమానుల్లో ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా ఆయన మేకోవర్ ఎలా ఉండబోతోందో తెలుసుకోవాలని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే, నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా రామ్ తన కొత్త సినిమాకు సంబంధించిన ఓ ఇంటెన్స్ ప్రీ లుక్ పోస్టర్‌ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఓ భారీ గ్రాండ్ సెట్ బ్యాక్‌డ్రాప్‌లో మెట్లపైకి వెళ్తూ కనిపించిన రామ్ లుక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఒక చేతిలో టెడ్డీ బేర్‌ను, మరో చేతిలో మెషిన్ గన్ను పట్టుకుని కనిపించడం పోస్టర్‌కు మరింత ఆసక్తిని జోడించింది. ఈ విభిన్నమైన విజువల్‌తో అభిమానులకు పురుషుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా, అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్ టీజర్‌ను కూడా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో సినిమా టైటిల్, రామ్ కొత్త అవతారం ఎలా ఉండబోతున్నాయనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది. మరోవైపు ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నారు. రామ్ సోదరుడు కృష్ణ పోతినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలిసారి దర్శకుడిగా రామ్ చేస్తున్న ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. రామ్ పోతినేని తన కెరీర్లో తొలిసారి దర్శకుడిగా మారుతూ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘RAPO23’. ఇప్పటివరకు హీరోగా ఎన్నో విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరించిన రామ్.. ఈ సినిమాతో నటుడిగానే కాకుండా రచయిత, దర్శకుడిగా కూడా తన ప్రతిభను నిరూపించుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రాన్ని సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా నియో నాయర్ నేపథ్యంతో, విభిన్నమైన కథాంశం మరియు ఇంటెన్స్ యాక్షన్ సన్నివేశాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

