in

Ram Pothineni expresses comfort with his single status!

తాజాగా జరిగిన ఒక ముఖాముఖిలో రామ్ తన జీవనశైలి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తాను కావాలని ఒంటరిగా ఉండాలని నిర్ణయించుకోలేదని, అది తన సహజ ప్రవృత్తి అని ఆయన పేర్కొన్నారు. చిన్నతనం నుంచే ఒంటరిగా సమయం గడపడం తనకు అలవాటని, ఆ ఏకాంతం తనకు ఎంతో ప్రశాంతతను ఇస్తుందని వివరించారు. షూటింగ్ సమయంలో వందలాది మంది మధ్య ఉన్నప్పటికీ, ఇంటికి రాగానే తనకంటూ ఒక ప్రత్యేక ప్రపంచాన్ని సృష్టించుకుంటానని రామ్ తెలిపారు..

సింగిల్ స్టేటస్ అనేది తన వ్యక్తిత్వంలో ఒక భాగమని రామ్ స్పష్టం చేశారు. “నా జీవితంలోకి ఎవరైనా వస్తే వారితో సమయం గడపడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. కానీ ఒకవేళ ఎవరూ రాకపోయినా, నేను ఒంటరిగా మరింత సంతోషంగా ఉంటాను” అని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్నేహితులతో సరదాగా గడపడం ఇష్టమే అయినా, తన కోసం తాను కేటాయించుకునే సమయం తనను మానసికంగా బలోపేతం చేస్తుందని ఆయన నమ్ముతున్నారు..!!

mrunal thakur finalized for peddi special song?

Who are the telugu best actors if a biopic is made on Indian cricketers!