రామ్ చరణ్ కొన్ని సంవత్సరాల క్రితమే ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే వారు. ఆయన కొన్న కారణాల వల్ల ఆ సమయంలో ట్విట్టర్ ను వదిలేశారు. దాదాపు ఆరు ఏడు సంవత్సరాల తర్వాత మళ్లీ ఈ ఏడాది మార్చిలో తన పుట్టిన రోజు సందర్బంగా ట్విట్టర్ లో రీ జాయిన్ అయ్యాడు. ఈసారి కొత్త గా కొత్త అకౌంట్ తో చరణ్ జీరో నుండి ప్రారంభించాడు. చిరంజీవి ట్విట్టర్ లో అడుగు పెట్టిన వెంటనే చరణ్ కూడా తిరిగి ట్విట్టర్ లో జాయిన్ అవుతున్నట్లుగా ప్రకటించాడు. చరణ్ ట్విట్టర్ లో జాయిన్ అయ్యి ఏడున్నర నెలలు అయ్యింది. అప్పుడే మిలియన్ మంది ఫాలోవర్స్ ను దక్కించుకున్నాడు.
సౌత్ కు చెందిన ఏ స్టార్ హీరోకు కూడా ఇంత ఫాస్ట్ గా మిలియన్ ఫాలోవర్స్ దక్కలేదు. అతి తక్కువ సమయంలోనే ట్విట్టర్ లో మిలియన్ ఫాలోవర్స్ ను దక్కించుకుని రామ్ చరణ్ రికార్డ్ దక్కించుకున్నాడు. చరణ్ చాలా చాలా అరుదుగా ట్వీట్స్ చేస్తున్నాడు. అయితే ఆయన చేస్తున్న ట్వీట్స్ లో ఎక్కువ శాతం ఆర్ఆర్ఆర్ సినిమా గురించిన విశేషాలు ఉంటున్నాయి. పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ ఉన్న ఆర్ఆర్ఆర్ సినిమా ట్వీట్స్ వల్ల ఎక్కువ మంది ఫాలోవర్స్ చరణ్ ఖాతాకు వచ్చి చేరుతున్నారనే అభిప్రాయం వ్యక్తం అ వుతోంది.