
టాలీవుడ్ హీరోయిన్స్ లొ మోస్ట్ ఫిట్ హీరోయిన్ ఎవరు అంటే రకుల్ ప్రీత్ సింగ్ అనే చెప్పాలి.. దీనికి నిదర్శనం రకుల్ తన బాడీ కోసం తీసుకొనే కేర్. రకుల్ కు రోజు వ్యాయామం చేసే అలవాటు ఉంది. తాను ఏ సిటీ లొ ఉన్న దగ్గరలో జిమ్ కు వెళ్లి వర్కౌట్ చేయడం రకుల్ యొక్క మెయిన్ హ్యాబిట్. ఇదే విషయం మీద తాజాగా మీడియాతో మాట్లాడుతూ రకుల్ కొన్ని ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పింది. ‘నేను రెగ్యులర్ గ జిమ్ కు వెళ్లి వ్యాయామం చేసేది మంచి ఫిజిక్ మెయింటేన్ చేసేందుకో లేదా అందంగా కనిపించడానికో కాదు.. కేవలం ఆరోగ్యాంగా ఉండడానికి మాత్రమే’ అని చెప్పుకొచ్చింది ఈ పొడువు కాళ్ళ సుందరి.
 
					 
					
