in

Rakul preet to start a Food Business in Hyderabad!

వైపు సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు వ్యాపారంలో అడుగుపెట్టిన వారి జాబితాల్లో ప్రముఖ నటి రకుల్‌ప్రీత్‌సింగ్ ఎప్పుడో చేరిపోయారు. ఇటీవల వివాహబంధంలోకి అడుగుపెట్టిన ఆమె ఇప్పటికే పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, విశాఖపట్టణం తదితర నగరాల్లో ‘ఎఫ్ 45’ పేరుతో జిమ్స్ నిర్వహిస్తున్నారు. అలాగే, వెల్‌బీయింగ్ న్యూట్రిషన్, వెల్‌నెస్ న్యూట్రిషన్ బ్రాండ్స్‌లోనూ ఆమెకు పెట్టుబడులు ఉన్నాయి. 2019లో న్యూబూ పేరుతో బయోడీగ్రేడబుల్, రీయూజబుల్ డైపర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా ఇప్పుడు ఫుడ్ బిజినెస్‌లోకి అడుగుపెట్టారు రకుల్.

‘ఆరంభం’ పేరుతో హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఈ నెల 16న ఓ రెస్టారెంట్ ప్రారంభించబోతున్నారు. ప్రముఖ కిచెన్ ఆపరేటర్ ‘క్యూర్‌ఫుడ్స్’ కొలాబరేషన్‌తో దీనిని ప్రారంభిస్తున్నారు. ఇందులో తృణధాన్యాలతో తయారుచేసే వంటకాలు లభిస్తాయి. ఫుడ్‌బిజినెస్‌లో కాలుమోపుతుండడంపై రకుల్ సంతోషం వ్యక్తం చేశారు. రెస్టారెంట్ ప్రారంభిస్తున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు..!!

boney kapoor : there will never be a Sridevi biopic

sree vishnu to romance monica reba john again!