in

boney kapoor : there will never be a Sridevi biopic

తాజా ఇంటర్వ్యూలో శ్రీదేవి బయోపిక్‌ గురించి మాట్లాడారు. తాను బతికుండగా శ్రీదేవి బయోపిక్‌ అంగీకరించనని స్పష్టం చేశారు. . ఆమె వ్యక్తిగత జీవితం ప్రపంచానికి తెలియడం ఇష్టం లేదన్నారు. ’శ్రీదేవి నటించిన ‘ఇంగ్లీష్‌ వింగ్లీష్‌’ చిత్రాన్ని మొదట ఐశ్వర్యారాయ్‌తో తీయాలనుకున్నారు. ఐశ్వర్య ఒకప్పటి మిస్‌ ఇండియా.. ఆమె ఇంగ్లిష్‌ రాని పాత్రలో నటిస్తే ప్రేక్షకులకు నచ్చదని చెప్పాను. ఆ పాత్రకు శ్రీదేవి కచ్చితంగా సరిపోతుందని చెప్పడంతో దర్శక నిర్మాతలు అంగీకరించారు.

ఆ చిత్రంలో ఇంగ్లీషు రాని గృహిణి పాత్రలో శ్రీదేవి జీవించింది. సినిమా ఎంతటి విజయం అందుకుందో తెలిసిందే! నా భార్య చాలా ప్రైవేట్‌ పర్సన్‌. ఆమె వ్యక్తిగత విషయాలను బయటకు చెప్పడానికి ఇష్టపడేది కాదు. జీవితమంతా అలానే ఉంది. ఇప్పుడు ఆ పర్సనల్‌ విషయాలు బయటకు చెప్పడానికి నేను అంగీకరించను. నేను బతికి ఉన్నంతవరకు బయోపిక్‌కు అనుమతివ్వను’ అని బోనీ కపూర్‌ స్పష్టం చేశారు..!!

allu arjun’s daughter in ntr’s devara!

another nickname of mahanati savitri!