తాజాగా పారితోషికం విషయంలో ప్రశ్నించిన జాబితాలో రకుల్ చేరారు. ఇదే విషయంపై ఆమె మాట్లాడారు. ‘‘ఒక సినిమా కోసం నటీనటులిద్దరూ ఒకేలా కష్టపడతారు. ఒక్కో సందర్భంగా ఇద్దరి కాల్షీట్లు సమానంగా ఉంటాయి. అయినా రెమ్యునరేషన్ విషయంలో తేడా చూపిస్తారు. ప్రేక్షకులను థియేటర్‌కు తీసుకురాగల సత్తా హీరోయిన్లకు ఉంటుంది. ఈ విషయాన్ని చిత్ర పరిశ్రమలోని వారు గుర్తించాలి. సినిమాలో మెయిన్ లీడ్స్‌కి సమాన పారితోషికాలు ఇవ్వాలి.
హీరోహీరోయిన్లకు వేర్వేరుగా ఇవ్వకూడదు. సినిమాలో క్యారెక్టర్ ఆకట్టుకుందంటే అది ఆ పాత్రకున్న బలం. అందులో ఎవరు నటించారన్నది కాదు’’ అని ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో చెప్పారు రకుల్. ఇదే వేదికపై ప్రియాంక నటించిన ‘సిటాడెల్’ వెబ్ సిరీస్ గురించి రకుల్ మాట్లాడారు. ‘‘ప్రియాంక ఇప్పుడు గ్లోబల్ లెవల్లో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. గతంలో ఆమె నటించిన సినిమాలకు అగ్రహీరోల సినిమాల కంటే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. నటీనటుల్లో టాలెంట్‌ను చూడాలి కానీ ఇలాంటి భేదం చూపించకూడదు అని అన్నారు..!!