రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలంటూ చెన్నైలో ఆందోళన ప్రారంభించారు. దీంతో మరోసారి రజినీకాంత్ తన రాజకీయాల్లోకి రావడంపై స్పష్టతనిచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఒక లేఖను రాసి పోస్ట్ చేశారు. అందులో ఆయన ఏం చెప్పారంటే.. “నన్ను బతికిస్తున్న దేవుళ్లయిన అభిమానులకు, రాజకీయాల్లోకి రావడం పట్ల నా నిర్ణయాన్ని మరోసారి పరిశీలించుకోవాలని కొందరు, కొందరు నా అభిమాన సంఘంలోని వ్యక్తులు చెన్నైలో ఓ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
దీన్ని క్రమశిక్షణా బద్ధంగా, గౌరవప్రదంగా నిర్వహించారు. అందుకు వారికి నా కృతజ్ఞతలు. అయితే నేను అధ్యక్షకుడినయినప్పటికీ.. నా ఆదేశాలను అతిక్రమించి సమావేశాన్ని నిర్వహించడం బాధాకరం. నేను నా నిర్ణయాన్ని అప్పుడే ప్రకటించాను. దయచేసి ఇంకెవ్వరూ ఇలాంటి సమావేశాలను నిర్వహించి, నన్ను రాజకీయాల్లోకి రమ్మని ఆహ్వానించి ఇబ్బంది పెట్టవద్దు అని మనస్ఫూర్తిగా విన్నవించుకుంటున్నాను” అని తెలిపారు రజినీకాంత్.