మనో గారు గాయకుడిగా , డబ్బింగ్ ఆర్టిస్ట్ గ అందరికి సుపరిచితులు, ఒక రోజు రాత్రి పది గంటలకు ఒక ఫోన్ వచ్చింది మనో గారికి అవతల వ్యక్తి నేను రజని కాంత్ ను మాట్లాడుతున్నాను అనగానే, ఏ రజిని కాంత్ అని అడిగేసారు ,వెంటనే నేను తమిళ యాక్టర్ రజని మాట్లాడుతున్నాను అనగానే కంగారుగా సారీ చెప్పారట మనో. సహజంగా మంచి హాస్యప్రియుడు స్నేహశీలి అయినా మనో గారికి చాల మంది హాస్య నటులు, మిమిక్రీ ఆర్టిస్ట్ లతో పరిచయాలు ఉండటం వలన వారెవరో ఫోన్ చేసి ఆటపట్టిస్తున్నారు అనుకున్నారు మనో, ఆ విషయం రజినీకి చెప్పి మరల ఒక సారీ, సారీ చెప్పారట. శివాజీ మూవీ తెలుగు వెర్షన్ కి చాల బాగా డబ్బింగ్ చెప్పారు ఒక విధంగా నాకంటే బాగా చెప్పారు అని చెప్పి మీకు ఏమి కావాలి అని అడిగారు రజని, మీరు స్వయంగా ఫోన్ చేయటమే ఒక గొప్ప గిఫ్ట్ సర్ నాకు ఇంతకంటే ఎం అవసరం లేదు కానీ ఒక చిన్న రిక్వెస్ట్, మా ఇంటి బిరియాని మీరు తింటే నాకు సంతోషం అనగానే పంపించండి అన్నారట రజని. మనో బిరియాని పంపటం అది తిని రజిని మెచ్చుకోవటం జరింగింది.