in

RAJAMOULI “EGO” HURT CHESINA SABU CYRIL!

రాజమౌళి ఇగో ను హార్ట్ చేసిన, ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్. “బాహుబలి” చిత్రం భారీతనానికి కేర్ అఫ్ అడ్రస్ గ మారిపోవడానికి అందులోని భారీ సెట్టింగ్స్ కూడా ఒక కారణం. రాజమౌళి ఉహలలోని భారీతనానికి వాస్తవ రూపం ఇచ్చిన ఆధునిక శిల్పి సాబు సిరిల్. అటువంటి సాబు, రాజమౌళిని ఎందుకు హార్ట్ చేసారు? “బాహబలి” హిట్ అయిన చాల కాలానికి రాజమౌళి గారు ఒక రోజు ” నువ్వు నా ఈగోను హార్ట్ చేసావు సాబు” అన్నారట, అది విన్న సాబు కంగారుగ, నేనా? ఎప్పుడు సర్ ? నాకు గుర్తులేదు అన్నారట. హార్ట్ చేసావు సాబు, నేను స్టోరీ చెప్పే విధానం చాలామందికి నచ్చుతుంది, అందరు మెచ్చుకుంటారు, అంతే కాదు నేను ఒక మంచి నరేటర్ అనే గొప్ప నమ్మకం ఉంది నాకు..

అటువంటి నేను, నీకు ముంబయి లో బాహుబలి స్టోరీ నరేట్ చేస్తున్నపుడు, స్టోరీ మొదలయిన కాసేపటికి నువ్వు ఆవులింతలు మొదలు పెట్టావు, కాఫీ తాగుదామా అంటూ అడగటం మొదలు పెట్టావు, స్టోరీ క్లైమాక్ కి వచ్చేసరికి నువ్వు సగం నిదురలో ఉన్నావు. నీ వాలకం చూసి నేను హార్ట్ అవటమే కాదు, నీ మీద డౌట్ పడ్డాను. కథ సరిగా వినని, నువ్వు వేసిన సెట్టింగ్స్ చూసి ఆశ్చర్య పోయాను, ఎలా సాధ్యం అయింది నీకు అన్నారట రాజమౌళి. అది విన్న సాబు, చంపేశారు పోండి, నేను ఇంకా ఏదో అయింది అనుకోని భయపడి పోయాను, నాకు అదొక పెద్ద వీక్నెస్ సర్, మీరే కాదు, ఎవరు కథ చెప్పిన కాసేపటికి నాకు తెలియకుండానే నిద్ర వచ్చేస్తుంది..

చిన్నప్పుడు అమ్మమ కధలు చెబుతుంటే నిద్రపోయే అలవాటు, నాకు ఆలా కంటిన్యూ అవుతుందేమో సర్. మీరు కథ మొదలు పెట్టి నపుడే నాకు అర్ధం అయిపొయింది మీరు ఈ చిత్రాన్ని ఎంత భారీగా తీయాలనుకుంటున్నారో, మీ ఆలోచనలకు తగి నట్లుగానే సెట్టింగ్స్ అన్ని భారీగా ప్లాన్ చేసుకున్నాను, అందుకే నెక్స్ట్ మీటింగ్లోనే మీ ఊహలకు తగిన సెట్టింగ్స్ డిజైన్ చేసి మీకు చూపించగలిగాను అని నవ్వేశారట సాబు సిరిల్ “.అన్నం ఉడికిందో లేదు చూడటానికి ఒక్క మెతుకు చూస్తే చాలు” అంటే ఇదేనేమో ??

Harini Reddy at G Films Production No. 1 Opening!

shocking : Prabhas and Pooja Hegde dupes shoot Radhe Shyam’s entire song!