![big-boss-winner-rahul-sipligunj-trolled-for-buying-a-car-teluguswag](https://teluguswag.com/wp-content/uploads/2020/01/big-boss-winner-rahul-sipligunj-trolled-for-buying-a-car-teluguswag.jpg)
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]తె[/qodef_dropcaps] లుగు బిగ్ బాస్ సీసన్ 3 విన్నర్ రాహుల్ సిప్లిగూంజ్ అందరి మనసులని దోచుకొని తనదైన శైలిలో ముందుకు సాగుతున్నాడు. అయితే, రాహుల్ నిన్న సోషల్ మీడియా లొ చేసిన ఒక పోస్ట్ తనకు తంటాలు తెచ్చిపెట్టింది. బిగ్ బాస్ హౌస్ లొ ఉన్నప్పుడు టైటిల్ గెలుస్తే ఎం చేస్తావ్ అని బిగ్ బాస్ ప్రశ్నించగా..మా అమ్మ నాన్నల కోసం ఉండడానికి ఒక మంచి సొంత ఇల్లు తీసుకుంటాను అని చెప్పాడు రాహుల్.
కానీ అతను ఇల్లు తీసుకోకుండా ప్రైజ్ మనీ తొ కాస్ట్లీ కార్ కొనడంతో అతనికి వోట్ వేసిన వారంతా ఇప్పుడు ఫైర్ అవుతున్నారు, డబ్బులు వచ్చాక అమ్మ నాన్నలని మర్చిపోయావా అంటూ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారు. దీనికి సమాధానంగా రాహుల్, నేను ముందే ఓ ప్లాట్ కొన్నాను. అది రెడీ అవ్వడానికి 7 నెలలు సమయం పడుతుంది అంటూ చెప్పుకోచూడు. ఇందులో ఎంత వాస్తవం ఉందొ తెలీదు కానీ బెంజ్ కార్ కొని బాగా ట్రోల్ అయ్యాడు బిగ్ బాస్ విన్నర్.