తెలుగు సినిమా ను కొత్త పుంతలు తొక్కించి, కమర్షియల్ సినిమా దమ్మును అందరికి చాటిన దర్శకుడు రాఘవేంద్ర రావు. ఎందరో హీరోలు అందరికి సూపర్ హిట్ లు, బ్లాక్ బస్టర్ హిట్ లు ఇచ్చిన దర్శకేంద్రుడు, కృష్ణ గారికి 100 % హిట్లు ఇచ్చారు, అక్కినేని గారికి మాత్రం ఒక్క హిట్ కూడా ఇవ్వలేక పోయారు. రాఘవేంద్ర రావు, అక్కినేని కాంబినేషన్ లో తయారయిన చిత్రాలు, 1 సత్యం శివమ్ 2 ప్రేమ కానుక 3 అగ్ని పుత్రుడు 4 పెళ్లి సంబంధం 5 శ్రీ రామదాసు. మొత్తం అయిదు చిత్రాలు అందులో అక్కినేని గారు సోలో హీరో గ నటించిన ఏకైక చిత్రం “ప్రేమ కానుక” ప్లాప్ అయింది, మిగిలిన నాలుగు చిత్రాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బిలో అవేరేజ్ అనే చెప్పాలి. ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు.
కృష్ణ గారు రాఘవేంద్ర రావు కాంబినేషన్ లో మొత్తం తొమ్మిది చిత్రాలు తయారయ్యాయి, మొత్తం తొమ్మిది చిత్రాలు సూపర్ హిట్ మరియు బ్లాక్ బస్టర్ హిట్ గ నిలిచాయి. చిత్రాల వివరాలు, 1 భలే కృష్ణుడు 2 ఘరానా దొంగ 3 ఊరికి మొనగాడు 4 అడవి సింహాలు 5 శక్తి 6 ఇద్దరు దొంగలు 7 అగ్ని పర్వతం 8 వజ్రాయుధం 9 రాజా కుమారుడు, అన్ని సూపర్ డూపర్ హిట్ చిత్రాలే. ఒక్క “రాజకుమారుడు” చిత్రంలోనే కృష్ణ గారు గెస్ట్ అప్పీరియన్సు చేసారు మిగిలిన ఎనిమిది చిత్రాలు ఫుల్ లెంగ్త్ అండ్ సోలో అండ్ కాంబినేషన్ రోల్స్ చేసారు. ఈ ఎనిమిది చిత్రాలలో నాలుగు చిత్రాలు సంక్రాంతి చిత్రాలుగా రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యాయి.