in

radika apte bold comments on heroines surgery!

నో ఫిల్ట‌ర్ లుక్.. సోష‌ల్ మీడియాలో ఇదొక ట్రెండ్ ఇప్పుడు. మేక‌ప్ వేయ‌కుండా.. టెక్నాల‌జీ ద్వారా మెరుగులు దిద్ద‌కుండా తాము ఒరిజిన‌ల్‌గా ఎలా ఉన్నామో అలాగే ఫొటోలు దిగి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేయ‌డం హీరోయిన్ల‌కు ఫ్యాష‌న్‌గా మారిందీ మ‌ధ్య‌. కొంద‌రు లైట్ మేక‌ప్ వేసి.. నో ఫిల్ట‌ర్ అంటూ మోసం చేసే ప్ర‌య‌త్నం చేస్తుంటారు. ఇంకొంద‌రు లైట్‌గా టెక్నాల‌జీ సాయంతో ఫొటోలు మెరుగులు దిద్దుతుంటారు. ఐతే ఇవేమీ చేయ‌కుండా ఒరిజిన‌ల్ ఫొటోలు పెట్టేవాళ్లూ ఉంటారు. ఐతే ఇదేమీ పెద్ద గొప్పేమీ కాదంటోంది డాషింగ్ హీరోయిన్ రాధికా ఆప్టే. హీరోయిన్ల‌లో చాలామంది స‌ర్జ‌రీల ద్వారా త‌మ అందాల‌కు మెరుగులు దిద్దుకుంటూ ఉంటారని..

ఈ నో ఫిల్ట‌ర్ ఫొటోలు పెట్ట‌డం ద్వారా ముందు ఆ స‌ర్జ‌రీలు ఆపాల‌ని కౌంట‌ర్లు వేసింది రాధికా. వ‌క్షోజాల సైజు పెంచుకోవ‌డం కోసం.. ముక్కును స‌రి చేసుకోవ‌డం కోసం.. ఇంకా కొన్ని లోపాలు స‌రిదిద్దుకోవ‌డం కోసం హీరోయిన్లు స‌ర్జ‌రీల‌ను ఆశ్రయించ‌డం మామూలే. ఇలా స‌ర్జ‌రీల‌కు వెళ్లి ముఖార‌విందాన్ని పెంచుకున్న వాళ్లూ ఉన్నారు. అలాగే దెబ్బ తీసుకున్న వాళ్లూ ఉన్నారు. శ్రీదేవి, శ్రుతి హాస‌న్ లాంటి వాళ్లు ముఖానికి చేయించుకున్న చిన్న స‌ర్జ‌రీల గురించి బ‌య‌టికి చెప్పుకున్నారు. కానీ ఈ విష‌యాలు బ‌య‌టికి చెప్ప‌కుండా దాచిన వాళ్లు చాలామందే ఉన్నారు. ఐతే బ‌య‌టికి చెప్పినా, చెప్ప‌కున్నా.. ఇలాంటి స‌ర్జ‌రీలు చేయించుకోవ‌డ‌మే క‌రెక్ట్ కాదంటోంది రాధికా.

Prabhas comments on Puri’s son, director becomes emotional!

Rashi Khanna Stills at an Event

Rashi Khanna Stills at an Event