ఒకానొక సందర్భం లో కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు, మన పూరి జగన్నాథ్ ను గట్టిగ హత్తుకొని నువ్వు నా నాలుగో కుమారుడివి అని పొగిడారు. ఎందుకు, ఏమిటి తెలుసుకోవాలి అంటే ఈ కధనం చదవండి. రాజ్ కుమార్ గారి తో ఉన్న పరిచయం, అయన కోరిక మేరకు వారికీ ఒక కథ వినిపించడానికి వారి ఇంటికి వెళ్లారు పూరి జగన్నాథ్ గారు, ఇల్లంతా కోలా హలం గ ఉంది, మౌనంగా ఒక రూమ్ లో కూర్చొని ఉన్న పూరి చుట్టూ చాల మంది చేరారు, ఇంతలో రాజ్ కుమార్ గారు, పార్వతమ్మ గారితో కలసి రూమ్ లోకి వచ్చారు, ఆయన రాగానే రూమ్ అంత నిశ్శబ్దం, కథ చెప్పండి అన్నారు రాజ్ కుమార్ ఎవరు సర్ వీళ్లంతా అని పూరి అడిగారు, వీళ్లంతా నా కుటుంబ సభ్యులు, పనివాళ్ళు, శ్రేయోభిలాషులు. అందరి అనుజ్ఞ తో పునీత్ ను హీరో గ ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నాను, మీరు కథ చెప్పండి అన్నారు, పూరి కి మతి పోయింది, స్టోరీ సిట్టింగ్ లాగా లేదు, ఒక చిన్న ఆడిటోరియం లో అందరికి కథ చెపుతున్నట్లు చెప్పారు, అందరికి నచ్చింది పూరి రిలాక్స్ అయ్యారు.
మా పునీత్ ను మీరే హీరో గ లాంచ్ చేస్తున్నారు అని చెప్పారు రాజ్ కుమార్ గారు. సినిమా మొదలయింది దాని పేరు” అప్పు”. సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కన్నడ నాట సంచలనం సృష్టించింది, కాసుల వర్షం కురిసింది, ఆ సినిమా విజయ ఉత్సవానికి సూపర్ స్టార్ రజిని మొదటి సారి కన్నడ సినిమా ఫంక్షన్ లో పాల్గొన్నారు. ఆ సందర్భం లో రాజ్ కుమార్ గారు నువ్వు నా నాలోగో కొడుకువి, నా పిల్లలెవరు నాకు ఇంత పేరు డబ్బు సంపాదించి పెట్ట లేదు అంటూ పూరి జగన్నాథ్ గారిని, గట్టిగ హత్త్తుకున్నారట. అదే కథను తెలుగు లో రవితేజ తో, తానే నిర్మాత గ మారి ఇడియట్ పేరు తో నిర్మించి రవితేజకు కూడా ఒక బ్రేక్ ఇచ్చారు పూరి జగన్నాథ్.