
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]సౌ[/qodef_dropcaps] త్ ఇండియన్ టాప్ హీరోయిన్స్ లో ఒకరు బ్యూటీ నయనతార, కెరీర్ అంత తను అనుకున్నట్లే సాఫీగా సాగిపోతుంది అని అనుకునే సమయంలో నయన్ కు ఇప్పుడు ఒక చిక్కు ఎదురైందని తెలుస్తుంది.. అదేంటంటే, ఈ భామ నటించే సినిమాలకు తన రెమ్యూనరేషన్ పాటు తన వెంట ఉండే సిబ్బంది జీతాలు కూడా నిర్మాతలు ఇస్తాను అంటేనే ఆమె సినిమా సైన్ చేస్తుందట. నయనతార క్రేజ్ అండ్ డిమాండ్ చూసి తన కండిషన్స్ కు ఇన్ని రోజులు ఒప్పుకున్నారు ప్రొడ్యూసర్స్.. అయితే సడన్ గ ఇప్పుడు ఏమైందో తెలీదు కానీ నయనతార కోరికలకు స్వస్తి పలకాలనే నిర్ణయానికి నిర్మాతలు వచ్చినట్టు సమాచారం. ఈ విషయం మీదే చర్చించడానికి త్వరలో తమిళ నిర్మాతల మండలి సమావేశమై ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. హీరోయిన్స్ రెమ్యూనరేషన్ కంటే ఎవరికి ఒక్క పైసా కూడా ఎక్కువ ఇవ్వొద్దని ఈ మండలి ఒక నిర్ణయానికి రానున్నట్టు తెలుస్తుంది.