in

producer Dil Raju plans big with KGF star yash!

టాలీవుడ్ లో తిరుగులేని నిర్మాత దిల్ రాజు. ఇప్పుడు ఆయ‌న పాన్ ఇండియా సినిమాల‌పై దృష్టి పెట్టారు. బాలీవుడ్ లో జెర్సీ రీమేక్ చేశారు. అది మంచి ఫ‌లితాల్ని అందివ్వ‌లేదు. ఇప్పుడు `హిట్‌` సినిమాని రీమేక్ చేశారు. త్వ‌ర‌లో విడుదల కాబోతోంది. విజ‌య్ సినిమాతో త‌మిళ‌నాట అడుగుపెట్టారు. ఇప్పుడు క‌న్న‌డ‌లోనూ త‌న ప్ర‌తాపం చూపించ‌బోతున్నారు. క‌న్న‌డ సూప‌ర్ స్టార్ య‌శ్ తో దిల్ రాజు ఓ సినిమా చేయ‌బోతున్న‌ట్టు టాక్‌. కేజీఎఫ్ చిత్రాల‌తో ఆక‌ట్టుకున్నాడు య‌శ్‌. త‌ను ఇప్పుడు స‌రికొత్త పాన్ ఇండియా హీరో.

త‌న‌తో సినిమాలు చేయ‌డానికి చాలామంది నిర్మాత‌లు ఉత్సాహం చూపిస్తున్నారు. అంద‌రికంటే ముందుగా దిల్ రాజు క‌ర్చీఫ్ వేసేశాడు. దిల్ రాజుతో ఓ సినిమా చేయ‌డానికి య‌శ్ అంగీకారం తెలిపాడ‌ని స‌మాచారం. కానీ ద‌ర్శ‌కుడు ఎవ‌ర‌న్న‌ది తేల‌లేదు. తెలుగులో అగ్ర ద‌ర్శ‌కులంతా… దాదాపుగా బిజీ. మ‌రి.. య‌శ్ కోసం.. ఎలాంటి ద‌ర్శ‌కుడ్ని వెదికి పెడ‌తాడో చూడాలి. అన్న‌ట్టు ఈ సినిమా కోసం య‌శ్ కి దాదాపు రూ.100 కోట్ల పారితోషికాన్ని ఆఫ‌ర్ చేశాడ‌ట దిల్ రాజు. త‌మిళ హీరో విజ‌య్‌కీ… వంద కోట్ల పారితోషికం ఇచ్చాడు దిల్ రాజు.

anil ravipudi picks 2 young beauties for balayya!

Avika Gor Stills at Bro Movie Press Meet!