డైరెక్టర్ అవ్వబోయి , నిర్మాత గ స్థిరపడిన చిల్లర కళ్యాణ్ గారు, ఎందుకు అలాగా జరిగేందో,దానితోపాటు కళ్యాణ్ గారు ఏ పని చేసిన అమావాస్య రోజు మొదలుపెడతారు ఎందుకో తెలుసుకోవాలని ఉందా? దాసరి, తమ్మారెడ్డి భరద్వాజ గార్ల దగ్గర అనేక సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గ పని చేసిన కళ్యాణ్ గారు, సుమన్ తో ఉన్న సాన్నిహిత్యం వలన అయన హీరో గ” నేటి న్యాయం” అనే సినిమా కళ్యాణ్ గారి డైరెక్షన్ లో ప్లాన్ చేసారు. ఆ టైం లోనే సుమన్ గారు కొన్ని కారణాల వలన జైలు కు వెళ్లారు, ఇంతలో ఖాళీ గ ఉండటం ఎందుకు అని, అనుకోకుండ తమిళ్ సినిమా ఒకటి,” హంతకుడు” అనే పేరుతో డబ్బింగ్ చేసారు..
సినిమా ముహర్తం, ఆదివారం, అమావాస్య రోజు జరిగింది, ఫస్ట్ కాపీ అమావాస్య రోజు వచ్చింది, ప్రివ్యూ అమావాస్య రోజు జరిగింది, ఫస్ట్ కాపీ అమావాస్య రోజే వచ్చింది, అదే రోజు సినిమా బిసినెస్ అవ్వడం కళ్యాణ్ గారికి మంచి లాభాలు రావటం జరిగింది, నిర్మాత గ ఆయనకు మొదటి సినిమా నే మంచి బ్రేక్ ఇచ్చింది. సహజం గ మన తెలుగు వారు అమావాస్య రోజు ఏ పని ప్రారంభించారు, అశుభంగా భావిస్తారు, కానీ కళ్యాణ్ గారికి అమావాస్య కల్సి వచ్చింది, అందుకే అయన ఆ సెంటిమెంట్ ను అలాగే కంటిన్యూ చేస్తున్నారు. దురదృష్టవంతుడిని ఎవరు బాగు చేయలేరు, అదృష్టవంతుడిని ఎవరు చెడగొట్టలేరు అంటారు, ఆలా అమావాస్య రూపం లో కళ్యాణ్ గారికి అదృష్ఠ్టం కలసి వచ్చింది.