in

Priya Prakash Varrier teams up with teja sajja for ‘ishq’!

కే ఒక్క కన్ను గీటుతో దేశ వ్యాప్తంగా అభిమానుల్నీ సంపాదించుకుంది మలయాళీ కుట్టి.  అయితే ఆమెకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి. ముఖ్యంగా తెలుగులో ప్రియా వరుస సినిమాలను చేస్తోంది. నితిన్ హీరోగా చంద్రశేఖర్ యేలేటీ దర్శకత్వంలో వచ్చిన చెక్ సినిమాలో ప్రియా మేయిన్ లీడ్ చేసింది. ఇక అది అలా ఉంటే తాజాగా ప్రియా ప్రకాష్ వారియర్‌ తెలుగులో మరో సినిమా చేస్తోంది. తేజా సజ్జాతో ఇష్క్ అనే సినిమాను చేస్తోంది.

తేజా సజ్జా బాల నటుడిగా పరిచయమే.. ఆయన హీరోగా ఇటీవల జాంబీ రెడ్డి అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ క్రేజీ కామెడీ థ్రిల్లర్ మంచి విజయాన్ని అందుకుంది. జాంబీల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా లాభాలను తెచ్చిపెట్టింది. ఇక ఆయన హీరోగా వస్తోన్న తాజా చిత్రం ఇష్క్. ఈ సినిమాను మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మిస్తోంది. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఇది ప్రేమకథ కాదు అనే ట్యాగ్‌లైన్‌ను ఇచ్చారు.

Chaavu Kaburu Challaga – Official Trailer,Kartikeya, Lavanya Tripathi!

Sreekaram​ Trailer, Sharwanand, Priyanka Arul Mohan!