Synopsis:
ప్రేమ విమానం 2023లో విడుదలైన వెబ్ ఫిల్మ్. అభిషేక్ పిక్చర్స్, జీ 5 బ్యానర్స్ పై అభిషేక్ నామా నిర్మించిన ఈ వెబ్ మూవీకి సంతోష్ కాటా దర్శకత్వం వహించాడు.
CAST: సంగీత్ శోభన్, శాన్వీ మేఘన, వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ప్రధాన పాత్రల్లో!!
TELUGU SWAG RATING: [usr 2.5]
Top Reviewers:
TELUGU FILM NAGAR (Rating: 2.25/5):
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ సినిమా ఓ ఎమోషనల్ ఫీల్ గుడ్ మూవీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అన్ని వర్గాల ప్రేక్షకులు చూసే సినిమా అని చెప్పొచ్చు.
FILMI BEAT (Rating: 2.75/5):
జీ5 ఓటీటీలో ప్రేమ విమానం స్ట్రీమింగ్ అవుతున్నది. తీరిక వేళల్లో అంచనాలు లేకుండా సినిమా చూస్తే నిరాశ పరచదు. అన్ని రకాల ఎమోషన్స్ మీకు కనెక్ట్ అయితే ఈ సినిమా మీకు నచ్చొచ్చు. కాబట్టి ఓటీటీలో ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.
Filmy Focus (Rating: 2/5):
స్టార్టింగ్ పోర్షన్ కొంత స్లోగా ఉంటుంది. కానీ తర్వాత బాగానే పికప్ అవుతుంది. సంగీత్ శోభన్ ట్రాక్ బాగానే వర్కౌట్ అయ్యింది. చివరి 40 నిమిషాలు అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా ఉంటుంది. ‘జీ5’ లో అందుబాటులో ఉంది. ఓటీటీ సినిమానే (Prema Vimanam) కాబట్టి.. ఈ వీకెండ్ కి ఒకసారి హ్యాపీగా ట్రై చేయొచ్చు.
123TELUGU (Rating: 2.5/5):
‘ప్రేమ విమానం’ అంటూ వచ్చిన ఈ ఎమోషనల్ ఫీల్ గుడ్ డ్రామాలో కొన్ని ఎమోషనల్ ఎలిమెంట్స్, కొన్ని లవ్ సీన్స్ ఆకట్టుకున్నాయి. ఐతే, సినిమాలో కథనం మాత్రం పూర్తి స్థాయిలో ఆసక్తికరంగా సాగలేదు. స్లో నేరేషన్, కమర్షియల్ ఎలిమెంట్స్ మిస్ కావడం, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. అయితే సినమాలో చెప్పాలనుకున్న మెయిన్ కంటెంట్ మరియు కొన్ని ఎమోషనల్ సన్నివేశాలు కనెక్ట్ అవుతాయి. మొత్తమ్మీద ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రం మెప్పించలేకపోయింది.
Hindustan Times (Rating: 2.75/5):
ప్రేమ విమానం రెండు కథలతో సాగే ఫీల్‌గుడ్ ఎమోషనల్ డ్రామా మూవీ. ఈ వీకెండ్‌తో ఫ్యామిలీతో కలిసి చూడటానికి మంచి ఛాయిస్‌గా నిలుస్తుంది.