మా ఎన్నికల బరిలో పోటీ పడేందుకు ప్రకాష్ రాజ్ ఇప్పటికే తన ప్యానెల్‌ను కూడా ప్రకటించాడు. అయితే ఆయనని పరభాషా వ్యక్తి అని కొందరు విమర్శిస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రకాష్ రాజ్..వీడు వేరేవాడు అనే ఆలోచనే తప్పు. ఇప్పుడు లోకల్.. నాన్‌లోకల్ అని మాట్లాడుతున్నవారికి.. నేను తెలంగాణలో కొండారెడ్డిపల్లిని దత్తత తీసుకొన్నప్పుడు నాన్‌లోకల్ అనిపించలేదా? నా అసిస్టెంట్లకు హైదరాబాద్‌లో ఇళ్లు కొని ఇచ్చినప్పుడు నాన్‌లోకల్ అనిపించలేదా? నాకు ఇక్కడ పొలం ఉంది. ఇల్లు ఉంది. నా కొడుకు ఇక్కడే స్కూలుకు వెళ్తాడు. నా ఆధార్ కార్డ్ అడ్రస్సు ఇక్కడే ఉంది. మరి నేను నాక్ లోకల్ ఎలా అవుతాను? అంతఃపురం సినిమాకు జాతీయ అవార్డు తీసుకున్నప్పుడు నేను నాన్‌లోకల్ కాలేదే! నవనందులు తీసుకున్నప్పుడు నాన్‌లోకల్ కాలేదే! అప్పుడు లేని విషయం ఇప్పుడు ఎలా వచ్చింది..??