[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]అ[/qodef_dropcaps] తనికి ఒక్క తెలుగు రాష్ట్రాలే కాదు.. ప్రపంచమంతా అభిమానులు ఉన్నారు. అవార్డులు పొందాడు.. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు.. ఎన్నో హిట్ సినిమాలు తీశాడు.. కానీ ఏం లాభం.. అందరికి అయినట్టు పెళ్లి మాత్రం ఇంకా కాలేదు.. అతను ఉ అంటే.. తెలుగు రాష్ట్రాల నుండే కాదు పక్క దేశాల నుండి కూడా అమ్మాయిలు పరిగెత్తుకుంటూ వస్తారు..
కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి అంటే చాలు దండం పెడుతాడు..ఒక్క ప్రభాసే కాదు.. అతని కుటుంబ సభ్యులు కూడా ప్రభాస్ పెళ్లి గురించి మాట్లాడారు.. పెద్దనాన్న కృష్ణం రాజు కూడా అంతే.. పెళ్లి ఎప్పుడు అంటే చాలు.. మెల్లగా తప్పించేసుకుంటారు.
కానీ ఆ సినిమా అవ్వాలంటే కూడా ఇంకా సంవత్సరం పడుతుంది.. ఇప్పటికే వయసు అయిపోయింది.. త్వరగా పెళ్లి చేసుకో అని ఎంతోమంది అభిమానులు కోరుకుంటున్న వేళలో ఓ విషయం వెలుగులోకి వచ్చింది. అది ఏంటి అంటే? ఒకరి మరణం కారణంగా ప్రభాస్ పెళ్లి 10 సంవత్సరాలు వాయిదా పడింది అని సమాచారం.
అది ఎవరి మరణం వాళ్ళో కాదు.. ప్రభాస్ తండ్రి మరణం కారణంగా 2011 లో జరగాల్సిన పెళ్లి 2021కి వాయిదా పడిందట. ప్రభాస్ తండ్రి మరణం 2010 డిసెంబర్ 10న సంభవించింది. అయితే ఆ మరణం కారణంగానే ప్రభాస్ పెళ్లి వాయిదా పడింది అని.. వాళ్ళ ఇంట్లో ఎవరైనా మరణిస్తే 10ఏళ్ళు ఆ ఇంట్లో పెళ్లిలాంటి శుభకార్యం జరగకూడదు అని.. అందుకే ప్రభాస్ పెళ్లి ఇంత ఆలస్యం అవుతుంది అని.. ఈ సంవత్సరంతో ప్రభాస్ తండ్రి మరణించి 10ఏళ్ళు గడుస్తుంది అని.. సో 2021లో పెళ్లి జరుగుతుంది అని వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంతమాత్రం నిజం ఉందొ దేవుడికే తెలియాలి.