
మోస్ట్ ఎలిజిబుల్ హ్యాండ్సమ్ ప్రభాస్ పెళ్లి వార్త ఎప్పుడైనా వైరలే. పెళ్లికూతురు ఎవరనేది మాత్రం మీడియా కల్పించిందే. స్నేహితులమేనని అనుష్క – ప్రభాస్ ఎన్ని సార్లు చెప్పినా.. రాసేస్తారు. మెగా డాటర్ నిహారికతో పెళ్లి ఫిక్స్ అయిందని మీడియా హల్చల్ చేసేసింది. వీటిపై మెగా ఫ్యామిలీ ఎన్నోసార్లు స్పందించారు. తాజాగా నిహారిక స్వయంగా ప్రభాస్ తో పెళ్లి వార్తలను తప్పని తోసిపుచ్చింది. ఇన్ని రకాలుగా హల్చల్ చేస్తున్న పెళ్లి వార్తలపై ప్రభాస్ స్పందించాడు. తనకు పెళ్లంటే అయిష్టం లేదని.. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటానని స్పష్టం చేశాడు. అయితే ఎప్పుడనేది మాత్రం చెప్పలేను అన్నాడు. అసలు నా పెళ్లి విషయం మా ఫ్యామిలీ కంటే మీడియా వారికే ఆత్రం ఎక్కువ ఉందని కౌంటర్ వేశాడు. పెళ్లి జరగుతుంది. జరగాల్సినప్పుడు అంటూ సెలవిచ్చాడు.

