in

interesting facts about uppena beauty Kriti Shetty!

ప్పెన సినిమాలోని పాటలకంటే ఎక్కువగా పాటలో కనిపించే ఈ హీరోయిన్ కి కుర్రకారులందరు ఫిదా అవుతున్నారు. ‘నీ కన్ను నీలి సముద్రం’ సాంగ్ చూడగానే.. ఏం క్యూట్ ఉందిరా హీరోయిన్.. ఏం పేరు అని సెర్చ్ చేయడం మొదలు పెట్టేసారు యూత్. ఆ హీరోయిన్ కు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళ్తే.. ఉప్పెన సినిమా హీరోయిన్ పేరు కృతి శెట్టి. ఆమె వయసు 16 సంవత్సరాలే. బెంగళూరుకు చెందిన కృతి శెట్టి సినిమాల్లోకి ఎలా వచ్చింది అంటే. ఆమె భరతనాట్యం నేర్చుకునే సమయంలో డైరెక్టర్ జై తీర్థ కృతిని యాక్టింగ్ నేర్చుకోమని సలహా ఇచ్చారంట.

ఆ తర్వాత ప్రీతి, సదరమే అనే స్టేజి షోలతో ఒక్కసారిగా కర్ణాటకలో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది కృతి శెట్టి. డైరెక్టర్ సునీల్ కుమార్ దేశాయ్ ‘సరిగమ’ అనే సినిమాతో మొదటిసారిగా తెరంగేట్రం చేసింది. సగక్కల్ సినిమాతో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. క్రేజ్ సంపాదించుకున్న కృతి శెట్టి అజగర్ సమియిన్ కుతిరయ్, కొండాన్ కొడుతాన్, పందియా నాడు, స్నేహవిన్ కాదలర్కాల్, మాంగ, సెవిల్ సినిమాల్లో నటించి మెప్పించింది. ఇంత పాపులర్ అయిన కృతి శెట్టి మైత్రి మూవీ మేకర్స్ కంట్లో పడింది. అప్పుడే తెలుగులో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ తేజ్ హీరోగా ఇంట్రోడ్యూస్ అవుతున్న ‘ఉప్పెన’ సినిమాలో ఛాన్స్ ఇచ్చారు. ఈమె నవ్వు.. సొట్ట బుగ్గలతోనే ఇప్పటికే ఫుల్ ఫాలోయింగ్ పెంచేసుకుంది.

RASHI REALISES HER MISTAKE!

VISHNU PRIYA’S DANCE VIDEO!