ప్రభాస్ ఆసక్తి కనబర్చకపోవడంతో ఆయా కంపెనీలు వెనక్కి తగ్గాయి. ఈ క్రమంలో మన బాహుబలి స్టార్ సుమారు రూ.150 కోట్లు విలువ చేసే బ్రాండ్స్ వదులుకున్నట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్‌కి ఉన్న స్టార్ స్టేటస్‌ని దృష్టిలో పెట్టుకుని.. ఆయన్ని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా చేసుకోవాలని కొన్ని అగ్ర వ్యాపార సంస్థలు భావించాయట. భారీ పారితోషికం ఆఫర్ చేస్తూ ప్రభాస్‌ని సంప్రదించాయట. వరుస సినిమా ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండడంతోపాటు..
ప్రేక్షకుల్లో తనకున్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని వచ్చిన బ్రాండ్స్ అన్నింటినీ ఓకే చేయకూడదని నిర్ణయించుకొన్నారు. ఆ ఉద్దేశంతో ఆయన కొన్నింటిని సున్నితంగా తిరస్కరించారని నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీని వల్ల ఆయన గడిచిన ఏడాది సుమారు రూ.150 కోట్లు విలువ చేసే కాంట్రాక్టులు వదులుకున్నట్లు సమాచారం. మరోవైపు, బాహుబలి సమయంలో.. షూట్స్‌లో బిజీగా ఉండడం చేత ఆయన రూ.10 కోట్లు విలువ చేసే బ్రాండ్ ఆఫర్స్ వదులుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.