in

prakash raj recalls his relation with shobhan babu!

న నటనతోనే కాదు అందంతోను ఆనాటి అమ్మాయిల హృదయాలను దోచిన నటుడు శోభన్ బాబు గారు, అందుకే ఆయన్ను అందరూ సోగ్గాడు అని పిలుస్తుంటారు. వందల చిత్రాలు చేసిన అనుభవం ఆయన సొంతం, ఎంతో మంది నటులు శోభన్ బాబు సినిమాలతోనే పరిచయమయ్యారు. ఎవరిలో ఎలాంటి ప్రతిభ దాగి ఉందొ ఆయన కనిపెట్టకుండా ఎలా ఉంటారు? అనేక భాషల్లో నటించి మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న ప్రకాష్ రాజ్ గారి గురించి శోభన్ బాబు గారు అప్పట్లో ఒక మాట చెప్పారట. ఈ విషయాన్ని ప్రకాష్ రాజ్ గారే ఒక సందర్భంలో చెప్పారు. శోభన్ బాబు చెప్పింది చెప్పినట్టుగానే తన జీవితంలో జరిగిందంటూ ఆ మాటల్ని గుర్తు చేసుకున్నారు.

“శోభన్ బాబు నేను ‘దొర బాబు’ చిత్రంలో నటించాం, నేను అప్పుడే ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్న దాంతో ఉత్సాహంగా కనిపించేవాణ్ని, యాక్షన్ సన్నివేశంలో నా ఆవేశం చూసి ‘ప్రకాష్.. నటనే కదా ఎందుకు అంత తొందర కాస్త నిదానం’ అన్నారు. అలాగే ఒక రోజు ఆయన నన్ను దగ్గరికి పిలిచి ‘ప్రకాష్ నువ్వు రెండేళ్ల తర్వాత నన్ను మళ్ళీ కలువు’. తర్వాత కలవమని ప్రత్యేకంగా చెప్పడం ఏమిటి గురువు గారు తప్పకుండా కలుస్తాను అని చెప్పను. ఆయన అప్పుడు నువ్వు కలవలేవు ఎందుకంటే అప్పుడు బిజీ ఉంటావు అని చెప్పారు.

ఆయన చెప్పినట్టుగానే తర్వాత నేను చాలా బిజీ అయిపోయాను ఉన్నట్టుండి ఒకరోజు ఆయన ఎదురైనప్పుడు ”గురువుగారు మీరు చెప్పిందే నిజమైంది మిమ్మల్ని కలవలేక పోయాను అంత బిజీగా అయ్యా” అని చెప్పాను. అప్పుడు ఆయన ‘నీలో ఉన్న సత్తాను చూసే ఆరోజు ఆ మాట చెప్పా, నీకు మరింత భవిష్యత్తు ఉంది మరింత ఎత్తుకు ఎదిగి పోతావు’ అని ఆయన చెప్పి వెళ్ళిపోయారు. ఆయన ఆశీర్వాదం తోనే ఇంత దూరం వచ్చాను అంటూ శోభన్ బాబు తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు ప్రకాష్ రాజు.

ntr fans deleted their twitter accounts!

stunning madhavi latha!