in

Prabhas Kalki makers issued public warning over leaks!

చాలా అత్యున్నత సాంకేతిక విలువలతో దర్శకుడు నాగ్ అశ్విన్ అండ్ టీం ఈ సినిమా కోసం ఎంతో ఎక్కువ కస్టపడుతూ వస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో వచ్చిన ఫస్ట్ లుక్ కానీ టీజర్ కి కానీ వావ్ అనిపించే రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఈ సినిమాతో ఇండియన్ సినిమా మరో స్థాయికి వెళ్తుంది అని అంతా ఫిక్స్ అయ్యిపోయారు. కానీ అనూహ్యంగా గత కొన్ని రోజులు కితం సినిమా నుంచి లీక్ అయ్యిన ఫోటోలు చిత్ర యూనిట్ కి షాకిచ్చింది. దీనితో చిత్ర యూనిట్ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నారు..

అలా లేటెస్ట్ గా స్వయంగా చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ వారే స్ట్రిక్ట్ వార్నింగ్ ఇస్తూ ఓ ప్రెస్ నోట్ ని రిలీజ్ చేశారు. దీనితో ఈ సినిమా నుంచి ఏవైనా లీకులు అయినా పోస్టర్ లేదా వీడియో ఏదైనా కూడా లీక్ చేసిన వారిని వాటిని స్ప్రెడ్ చేసిన వారి పైనా లీగల్ గా స్ట్రాంగ్ ఆక్షన్ తీసుకోవడం జరుగుతుంది అని. తాము ఆ సినిమా ఓనర్స్ సోషల్ మీడియాలో లీక్స్ ని ఎవరైనా స్ప్రెడ్ చేయడం జరిగితే వారంతా శిక్షార్హులు అందుకే జాగ్రత్తగా ఉండాలి అంటూ చిత్ర యూనిట్ గట్టి వార్నింగ్ ఇప్పుడు ఇచ్చారు. కాగా ఈ చిత్రంలో కమల్ హాసన్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్  గ్రాండ్ కాస్టింగ్ నటిస్తున్నారు..!!

Shraddha Kapoor Intentionally IGNORES Rashmika Mandanna?

Boyapati Srinu confirms his next with Suriya!