in

Prabhas is reportedly collaborating with Director Rishab Shetty!

‘హోంభలే ప్రొడక్షన్స్’ తో ప్రభాస్ మూడు సినిమాల ఒప్పందం

ప్రస్తుతం రాజా సాబ్, ఫౌజీ సినిమాల్లో ఏక కాలంలో వర్క్ చేస్తున్నాడు. నెక్స్ట్ సందీప్ వంగాతో స్పిరిట్ ఉంది. సలార్ 2, కల్కి 2 కూడా పెండింగ్ లో ఉన్నాయి. ప్రభాస్ కి ఉన్నక్రేజ్ ని క్యాష్ చేసుకోవటానికి ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన హోంభలే ప్రొడక్షన్స్ మూడు సినిమాలకి  ఒప్పందం చేసుకుంది. అందులో ఒకటి సలార్ 2 , రెండో సినిమా కోసం కోలీవుడ్ క్రేజీ డైరక్టర్ లోకేష్ కనక రాజ్ పేరు వినిపిస్తోంది.

‘కాంతార’ హీరో రిషబ్ శెట్టితో కలిసి ప్రభాస్ సినిమా
ఇక మూడో సినిమాకోసం కాంతారా హీరో రిషబ్ శెట్టి రంగంలోకి దిగాడంట. ప్రభాస్ తో నటించటానికి కాదు కథ అందిస్తున్నాడట. రిషబ్ ఇప్పటికే హోంబాలే ఫిలిమ్స్ తో కలిసి “కాంతార 2” కి వర్క్ చేస్తున్నాడు. ప్రభాస్ కోసం కథలు వెతుకుతున్న క్రమంలో రిషబ్, ప్రభాస్ కి మ్యాచ్ అయ్యే ఒక పవర్ఫుల్ కథను చెప్పారట. అన్నీ కుదిరితే హోంభలే వాళ్ళు ఒప్పుకుంటే దర్శకత్వ బాధ్యతలు కూడా తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నాడు అని సమాచారం. కాంతారాతో దర్శకుడిగా రిషబ్ బెస్ట్ అనిపించుకున్నారు..!!

Ram Charan reunites with pushpa director Sukumar!

Bollywood superstar cameo in Ram Charan, Janhvi Kapoor’s film?