
[qodef_dropcaps type=”square” color=”#ffffff” background_color=””]బా[/qodef_dropcaps] హుబలి సినిమా తరువాత రెబెల్ స్టార్ ప్రభాస్ నార్త్ నుండి సౌత్ వరకు అందరికి డార్లింగ్ అయిపోయాడు. బాలీవుడ్ లొ ప్రభాస్ డైరెక్ట్ ఫిలిం చేయకున్నా బాహుబలి ఇంకా సాహూ సినిమాలతో అక్కడివారిని విపరీతంగా ఆకట్టుకున్నాడు. ప్రభాస్ చేతిలో బి టౌన్ లొ ఇప్పుడు రెండు భారీ ఆఫర్లు ఉన్నట్లు గ సమాచారం. కరణ్ జోహార్, ఆదిత్య చోప్రా లాంటి ప్రముఖ నిర్మాతలు ప్రభాస్ ని బాలీవుడ్ లోకి దింపేందుకు ఇదెవరకే ప్రయత్నించగా ప్రభాస్ వారి ఆఫర్స్ ని కాదన్నాడు. అయితే ఆదిత్య చోప్రా మళ్ళి ఒకసారి ప్రభాస్‌ను ఈ విషయమై సంప్రదింపులు జరిపారట, ధూమ్ 3 కి సిక్వెల్ ధూమ్ 4 లొ నటించాలని ప్రభాస్‌ను కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి, మరి ప్రభాస్ ఈ క్రేజీ ఆఫర్ కి సరే అంటాడా లేక ఇదివరకటిలా రిజెక్ట్ చేస్తాడా వేచి చూడాలి. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ప్రభాస్ ఒకవేళ ధూమ్ ఆఫర్ కావాలి అనుకుంటే అతడు నెగిటివ్ రోల్ చేయాల్సి ఉంటుంది. ధూమ్ 1 లొ జాన్ అబ్రహం, ధూమ్ 2 లొ హ్రితిక్ రోషన్ ఇంక ధూమ్ ౩ లొ అమీర్ ఖాన్ లాగా.