in

Powerful title for Balakrishna – Gopichand Malineni project!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. సింహా, లెజెండ్ త‌ర్వాత బోయపాటి శీనుతో క‌లిసి అఖండ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తైన‌ట్టు తెలుస్తుండ‌గా, ఈ మూవీ రిలీజ్ గురించి త్వ‌ర‌లోనే క్లారిటీ రానుంది. అయితే అఖండ త‌ర్వాత బాల‌య్య‌.. డాన్ శీను, బలుపు, పండగ చేసుకో, క్రాక్ వంటి సినిమాలకి దర్శకత్వం వహించిన గోపీచంద్ మలినేని ద‌ర్శ‌క‌త్వంలో సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమా గురించి ఇప్పుడు ఆసక్తిక‌ర‌మైన వార్త ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. చిత్రానికి రౌడీయిజం అనే టైటిల్ ను ఫిలింఛాంబర్లో రిజిస్టర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది. త్రిష లేదా ఇలియానా ని ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర కోసం ఎంపిక చేయనున్నారు.

hamsa nandini latest clicks at a resort!

paisa vasool beauty keeps all hopes on ‘maro prasthanam’!