ప్రతాప్ ఆర్ట్స్ అధినేత రాఘవ గారు తాత మనవడు చిత్రం ద్వారా దాసరి నారాయణ రావు గారిని డైరెక్టర్ గ పరిచయం చేసారు. ఆ తరువాత కొంత కాలం తరువాత రాఘవ గారు దాసరి డైరెక్షన్ లో ” తూర్పు పడమర ” అనే చిత్రం తీశారు, ఆ చిత్రం విజయవంతం గ ఆడుతున్న రోజుల్లో 50 వ రోజు పోస్టర్లో దర్శకుడి పేరు వేయవలసిన మేఘం లో ” ఆఫీస్ బాయ్ గోపాల్ ” అని వేశారు. ఆ పోస్టర్ చూసిన సినీ రంగ ప్రముఖులు, ప్రేక్షకులు ఆశ్ఛర్య పోయారు. దాని కి కారణం ఉంది, తూర్పు పడమర చిత్రంలో సత్యనారాయణ గారి మీద ఒక పాట పెండింగ్ ఉండగా దాసరి గారు బంగారక్క చిత్రం షూటింగ్ కోసం హైదరాబాద్ వెళుతూ, తన అసిస్టెంట్స్ ను ఆ పాట తీయమని చెప్పారట, అది తెలిసిన రాఘవ గారికి కోపం వచ్చింది, వెంటనే దాసరి గారి ఇంటికి చేరుకొని,
ఎయిర్ పోర్ట్ కి వెళ్లబోతున్న దాసరి గారి కారుకి తన కారు అడ్డం పెట్టి, తన చిత్రం పూర్తి చేసి వెళ్ళమని పట్టుబట్టారట, రాఘవ గారి గురించి తెలిసిన దాసరి, సత్యనారాయణ గారు హైదరాబాద్ లోనే ఉన్నారు కాబట్టి, ఈ పాట కూడా అక్కడే తీస్తాను అన్నారట, అయితే దానికి అయ్యే ఖర్చు మొత్తం దాసరి గారే పెట్టుకోవాలని షరతు పెట్టారట, దానికి ఒప్పుకున్న దాసరి గారు ఆ పాటను హైద్రాబాదులోనే తన ఖర్చు తో తీశారు, సినిమా రిలీజ్ అయింది మంచి హిట్ అయింది. అప్పటి నుంచి దాసరి గారు రాఘవ గారిని దూరం పెట్టారట, ఆ కోపం తో సినిమా విజయం లో ఆఫీస్ బాయ్ పాత్ర కూడా ఉంటుంది అనే భావం వచ్చేట్లు, దాసరి పేరుకు బదులు ఆఫీస్ బాయ్ పేరు వేశారు రాఘవ గారు.