గతంలో ఈ చైర్మన్ పదవిని జగన్ కు అత్యంత నమ్మకస్తుడిగా పేరు ఉన్న విజయ్ చందర్ నిర్వహించేవారు. ఇప్పుడు ఆయన స్థానంలో పోసాని కృష్ణ మురళి నియామకం జరిగింది. ఇక మరోపక్క 2019 ఎన్నికల ముందు తెలుగుదేశానికి గుడ్ బై చెప్పి జై జగన్ నినాదం అందుకున్న ఆలీకి కూడా ఇటీవల ఒక ప్రభుత్వ పదవి వరించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా అలీ నియమితులయ్యారు.
నిజానికి తెలుగుదేశం హయాంలో అంబికా దర్బార్ బత్తి తయారీ సంస్థ నిర్వాహకులు, సినీ నిర్మాత అంబికా కృష్ణ ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్‌గా పనిచేశారు. ఆ తర్వాత వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక ఏపీ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా సీనియర్ నటుడు బాలచందర్ పని చేశారు. అయితే ఆయన నియామకం కంటే ముందే ఫిలిం డెవలప్‌మెంట్ కార్పోరేషన్ చైర్మన్‌గా మోహన్ బాబు పేరు కూడా వినిపించింది. కానీ ఎట్టకేలకు పోసానిని ఆ పదవి వరించడం గమనార్హం..!!