
విలువ తెలియని వాడి చేతికి వజ్రం దొరికితే రాయి అనుకోని విసిరివేస్తాడు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ గారికి, తన కెరీర్ ప్రారంభ దశ లో ఇటువంటి అనుభవమే ఒకటి ఎదురయింది. అవకాశం కోసం ఒక సంగీత దర్శకుడు వద్దకు వెళితే, అశోక్ గారికి అవకాశం ఇష్టం లేక అపాయింట్మెంట్ ఇవ్వటానికి చాల రోజులు తిప్పి, చివరకు ఒక్క రాత్రిలో 60 పల్లవులు వ్రాసి తీసుకొని వస్తే అందులో తనకు నచ్చిన పల్లవి కి, ట్యూన్ కి అనుగుణంగ, మళ్ళీ 60 పల్లవులు వ్రాసుకొని రావాలని టాస్క్ ఇచ్చాడు.రాత్రి అంత కష్టపడి 45 , 46 పల్లవులు వ్రాసిన అశోక్ తేజ గారు సంగీత దర్శకుడిని కలసి, తాను వ్రాసిన పల్లవులు చూపించితే 60 పల్లవులు వ్రాయమంటే వ్రాయలేని వాడివి నువ్వు ఏమి రచయితవయ్యా, అంటూ ఎద్దేవా చేసి ఆ చిత్రంలో అవకాశం ఇవ్వలేదట. చుడండి పాపం ఎవరికైనా ఒక రాత్రిలో అన్ని పల్లవులు వ్రాయటం సాధ్యమా చెప్పండి. అదే సుద్దాల అశోక్ తేజ ఇప్పటివరకు, 2400 పాటలు వ్రాసారు, ఠాగూర్ చిత్రంలో తాను వ్రాసిన పాటకు జాతీయ స్థాయి అవార్డు పొందారు. కాలక్రమంలో అదే సంగీత దర్శకుడు కూడా అశోక్ గారి చేత పాటలు వ్రాయించుకున్నారు.అశోక్ తేజ గారు ఇంకా పాటలు వ్రాస్తున్నారు, కానీ పాపం ఆ సంగీత దర్శకుడు మాత్రం దర్శకత్వం మానేశారు.చాల మంది ప్రతిభావంతులు ఇటువంటి కుహనా మేధావుల కారణం గ గుర్తింపు పొందలేక మరుగున పడిపోతుంటారు. కానీ సుద్దాల అశోక్ తేజ వాటిని అధిగమించి సినీ ప్రపంచం లో గుర్తింపు సాధించారు.సెహబాష్,అశోక్ తేజ పోరాటాల సుద్దాల హనుమంతు బిడ్డవు అని నిరూపించావు

