in

pop singer Shirley Setia in naga shourya’s next!

టాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనీష్ కృష్ణ కాంబినేష‌న్‌లో ఐరా క్రియేష‌న్స్ ఓ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్‌ను ఇటీవ‌ల లాంచ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇంకా టైటిల్ నిర్ణ‌యించ‌ని ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ డిసెంబ‌ర్ నుంచి జ‌ర‌గ‌నుంది. ఆక్లాండ్‌కు చెంది, ఫోర్బ్స్ మ్యాగ‌జైన్‌లో స్థానం పొందిన సంచ‌ల‌న గాయ‌ని, న‌టి షిర్లీ సేతియా ఈ మూవీలో నాగ‌శౌర్య జోడీగా ఎంపిక‌య్యారు.

నెట్‌ఫ్లిక్స్ ఫిల్మ్ ‘మ‌స్కా’తో న‌టిగా మారిన షిర్లీ, త్వ‌ర‌లో ‘నిక‌మ్మా’ చిత్రంతో బాలీవుడ్‌లోనూ ప‌రిచ‌యం అవుతున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రాన్ని ఉష ముల్పూరి నిర్మిస్తున్నారు. ద‌ర్శ‌కునిగా అనీష్ కృష్ణ‌కు ఇది మూడో సినిమా. మ‌హ‌తి స్వ‌ర‌సాగ‌ర్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, సాయి శ్రీ‌రామ్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

ravi teja’s ‘krack’ movie in legal issues!

YOUNG HERO VARUN TEJ IN 1917 MOVIE TELUGUSWAG EDITS